మాట జవ దాటితే ఏమవుతుందో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

atchamnaidu-18.jpg

టీడీపీ కార్యకర్తల్లారా.. పసుపు బిళ్ల పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. మీకు అక్కడి అధికార యంత్రాంగం సకల రాచమర్యాదలు చేస్తుంది. అలా చేయకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు అంటూ ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. అంతేకాదు.. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టవద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. ఆ భేటీలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 

Share this post

scroll to top