ఉత్తరాంధ్ర ప్రజలు భారీ ఎన్డీయే కూటమిని మెజారిటీతో గెలిపించారన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయాల్లో విర్రవీగిన వారికి ప్రజలు తగిన శిక్ష వేశారని చురకలు అంటించారు. రాష్ట్రం నిలదొక్కుకోవడానికి తమ బాధ్యత తాము నిర్వహిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించారు సీఎం చంద్రబాబు. పోలవరం ఎడమకాలువ పనులను పరిశీలించడంతో పాటూ భోగాపురం ఎయిర్ పోర్టు పనులపై ఆధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు.
రాష్ట్ర అభివృద్దికి ప్రజలు సహకరించాలి’.. ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు
