జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబుకు నష్టం.. 

chantha-mohan-31-.jpg

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్. గుంటూరులో మీడియాలో మాట్లాడిన ఆయన. జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదన్నారు చింతా మోహన్‌ ఇక, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగడంలేదు. హైదారాబాద్ లో కూర్చుంటే పనులు జరగడం లేదు ప్రస్తుతం ఈవీఎంల మేనేజ్‌మెంట్‌ జరుగుతోంది. గెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని సూచించారు.

దళితులపై వివక్ష, అంటరానితనం ఎలా ఉంటుందో కళ్లారా చూసిన వ్యక్తిని నేను అన్నారు చింతా మోహన్‌. ఒకప్పుడు దళితుల నాడి పట్టుకుని వైద్యం చేయడానికి కూడా వెనకాడేవారని పేర్కొన్న ఆయన మూతికి ముంత, వెనుక తాటాకు కట్టుకుని తిరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటరాని తనం రూపు మాపాలని గాంధీకి నెహ్రూకు చెప్పారు. రాజ్యాంగంలో ఎస్సీలకు 15 శాతం ఇచ్చిన ఘనత, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కిచ, కాంగ్రెస్ నాయకులకు దక్కిందన్నారు. అయితే, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో అమలు చేయలేని వర్గీకరణను ఏపీలో చంద్రబాబు అమలు చేయాలని చేస్తున్నారు. ఏకసభ్య కమిటీ పేరుతో చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని డిమాండ్‌ చేశారు.

Share this post

scroll to top