భవానీపురంలో వచ్చిన నీళ్లు అన్ని ప్రాంతాలనూ ముంచెత్తింది. బుడమేరు ప్రవహాన్ని మళ్లించేందుకు తీసుకున్న చర్యలేవీ అమలు కాలేదన్నారు. బుడమేరు సమీపంలో ఆక్రమణలు పెరిగాయన్న ఆయన బుడమేరు కాల్వ వాగును లేకుండా ఆక్రమణలు వచ్చాయి. బుడమేరు ఆక్రమణలపై సర్వే చేయమన్నాం అన్నారు. వివిధ ఉద్యోగ సంఘాలు ఒక్క రోజు జీతం విరాళం ఇవ్వడానికి మందుకొచ్చారు. పరిస్థితిని నార్మల్ స్థితికి తీసుకురావాలి. సాయంత్రం లేదా రేపట్నుంచి నిత్యావసర వస్తవుల పంపిణీ చేపట్టనున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఏపీ లో హైడ్రా కబ్జాలు తొలగిస్తాం..
