రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు, ఈ నెల 23వ తేదీన గ్రామసభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించనునారు. గత ప్రభుత్వ హయాంలో నరేగా పనుల్లో అవినీతి ఏమైనా జరిగిందా అనే అంశం పైనా సమీక్షించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం, రిపేర్లపై సమీక్షలో ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అటవీ, పర్యావరణం సమీక్షలో ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి, మొక్కల పెంపకం, అర్బన్ ఫారెస్ట్రీ వంటి అంశాలపై కీలక చర్చ సాగనుంది. కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కి రప్పించడం, ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి వంటి అంశాలపై కర్ణాటక ప్రభుత్వంతో తాను జరిపిన చర్చల వివరాలను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించనున్నారు.
కీలక శాఖలపై నేడు సీఎం చంద్రబాబు..
