కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ తండ్రి మృతి..

cbn-22.jpg

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి సూర్యనారాయణరాజు (91) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన భౌతిక కాయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఇంటికి తరలించారు. ప్రజల దర్శనార్థం మధ్యాహ్నం వరకే అక్కడే ఉంచి ఆ తర్వాత బలుసుమూడి మోక్షధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భూపతిరాజు సూర్యనారాయణరాజు మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. కోలుకుంటారనుకున్న ఆయన ఆస్పత్రిలోనే చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సూర్యనారాయణరాజు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

Share this post

scroll to top