ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు చైర్మన్‌గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. పారిశ్రామికాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. ఇక, అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం.
సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ..
