ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు అందిస్తామన్నారు. సూపర్-6 హామీలు అమలు చేయడంతోపాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కాగా కడపలో టీడీపీ మహానాడు జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఐంది. దీనిపై తాజగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త..
