మూడేళ్లలో రాజధాని పూర్తి నిర్మాణం..

cm-cbn-19.jpg

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్లతో గతంలో సీఆర్డీయే కార్యాలయ పనులు చేపట్టారు. ఆ పనులను సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. సీఆర్డీయే ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణాన్ని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. రాజధాని అమరావతి పనులు వేగవంతం కానున్నాయి. కేంద్రం కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Share this post

scroll to top