ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు జరగనుంది. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పధకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పి.ఫోర్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చ జరగనుంది.
స్వర్ణాంధ్ర విజన్‌పై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్..
