శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు..

chandrababu-1.jpg

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వచ్చారు. అక్కడ చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకోగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రత్యేక పూజలు చేసి. జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లారు. మడకశిర మండలంలో గుండమలలో పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this post

scroll to top