ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటికి నాలుగో రోజుకి చేరుకున్నాయి.. గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాగా, నేడు సభ ప్రారంభమైన వెంటనే ఇక ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించింది. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించనున్నారు. డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత సర్కార్ వైఖరి, వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. గడచిన ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలనూ శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ వేదికగా శాంతిభద్రతలపై నేడు శ్వేతపత్రం..
