విద్యుద్ఘాత ప్రమాదంపై సీఎం విచారం..

cbn-04.jpg

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మరణించిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Share this post

scroll to top