పులివెందులలో సీఎం జగన్ కు ఆధిక్యం… హిందూపురం ఎంపీ స్థానంలో వైసీపీ లీడ్

jagana-as.jpg

ఏపీ సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తన సమీప ప్రత్యర్థి బీటెక్ రవి కంటే జగన్ ఆధిక్యంలో నిలిచారు. మరో 12 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

చీపురుపల్లిలో మంత్రి బొత్స, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య, ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో నిలవగా… అనపర్తిలోనూ వైసీపీ ముందంజలో ఉంది. తిరుపతి అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో వైసీపీ లీడింగ్ లో కొనసాగుతోంది. హిందూపురం ఎంపీ స్థానంలోనూ వైసీపీ ముందంజలో ఉంది.

Share this post

scroll to top