ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. కుటుంబంతో పాటు మే 17న లండన్ వెళ్లిన జగన్.. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. పార్టీ అధినేతకు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఎయిర్ పోర్ట్ బయట బారులు తీరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్ఫగుచ్ఛాలతో సీఎం జగన్ కు స్వాగతం పలికారు. పదిహేను రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్ లలో పర్యటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన సీఎం జగన్
