తిరుపతిలో తొక్కిసలాట ఘటనా స్థలానికి పవన్ కల్యాణ్..

psavan-kalyan-09.jpg

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తిరుపతి వాసుల్లో కలకలాన్ని రేపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భక్తులు టోకెన్ల కోసం తరలి రావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, రాజకీయ నేతలు ఇలా బాధితులను పరామర్శిస్తున్నారు. ఇక, నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, కొద్దిసేపటి కిందట ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను అడిగి తెలుసుకున్నారు పవన్‌ కల్యాణ్‌ ఆ తర్వాత స్విమ్స్‌కు వెళ్లిపోయిన పవన్‌ కల్యాణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

Share this post

scroll to top