ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని.. అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంటూ ప్రశ్నించారు. నాగార్జునసాగర్ కుడి కెనాల్‌కు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదు. టీటీడీ బోర్డు, ఆదాయంలో వాటా కావాలని తెలంగాణ కోరింది. పోర్టుల్లో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగింది. ఇద్దరు సీఎంల భేటీ సారాంశాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏ ద్రోహాన్నిచేయబోతున్నారు?’’ అని అంబటి రాంబాబు నిలదీశారు.
విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు..
