ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సిద్ధార్థనగర్‌లోని దేవల్వా గ్రామంలో ఓ పెళ్లి సందర్భంగా తీసిన వీడియో ఇది. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి కారణం పెళ్లి ఊరేగింపులో ఆ కుటుంబీకులు చేసిన హడావుడి. పెళ్లి బరాత్ సందర్భంగా వారు దాదాపు ఇరవై లక్షల రూపాయల నోట్ల కట్టలు గాలిలోకి వెదజల్లారు. పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు కొందరు ఇంటి పైకప్పు, జేసీబీలపైకి ఎక్కి మరీ కరెన్సీ నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు. ఇదంతా కొందరు వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది. వీడియోలో చాలా మంది గాలిలోకి నోట్లు విసురుతున్నట్లు కనిపిస్తోంది. 100, 200, 500 రూపాయల నోట్లను గాలిలోకి విసిరినట్లు సమాచారం. ఇందుకోసం వారు జేసీబీని కూడా పిలిపించారు. కొందరు దానిపై నిలబడి, మరికొందరు బిల్డిండ్‌పై పైకప్పుపై నిలబడి కరెన్సీ నోట్లను జల్లుతున్నారు. ఈ నోట్లను సేకరించేందుకు చాలా మంది తరలివచ్చారు.
పెళ్లి బరాత్ లో కురిసిన డబ్బు వర్షం..
