గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లక్షలాది మంది వాలంటీర్లలో అనుమానాలు పెరుగుతున్నాయి. తమను కొనసాగిస్తారన్న నమ్మకం కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై గతంలో పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, వాలంటీర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది.
వాలంటీర్లు కొనసాగడం డౌటేనా..
