చంద్రబాబు ఇల్లు మునుగుతుందనే బుడమేరు గేట్లు ఎత్తారు..

ys-jagan-4-2.jpg

ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు కరకట్ట ఇంట్లోకి నీళ్లు వెళ్లాయి కాబట్టే ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. పైగా ప్రజల కోసం కలెక్టర్ ఆఫీసులో ఉంటున్నట్లు ప్రచారం చేస్తున్నారని సెటైర్లు వేశారు.

తమ ప్రభుత్వం హయాంలో ఇంత హడావుడి చేయలేదని జగన్ వ్యాఖ్యానించారు. వాలంటీర్లు, అధికారులు సహాయ చర్యల్లో పాల్గొనే వారని తెలిపారు. తాము కట్టిన రిటైనింగ్ వాల్ వల్లే చాలా సేవ్ అయిందన్నారు. ప్రమాదకర పరిస్థితులు తప్పాయని చెప్పారు. వరదలకు చనిపోయిన 32 మంది కుటుంబ సభ్యులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు వద్దే తప్పు జరిగిందని, ఆ తప్పును కప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందనే బుడమేరు వాగు గేట్లు ఎత్తారని ఆరోపించారు. పైగా అధికారులు తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా ఎందుకు రివ్యూలు చేయలేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

Share this post

scroll to top