మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. ఆయన రిమాండ్ గడువును కోర్టు పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు వంశీ రిమాండ్‌ను పొడిగించిన ధర్మాసనం తాజాగా సైతం అదే ఆదేశాలను కొనసాగించింది. గన్నవరం తెలుగుదేశం పార్టీపై దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నమోదు బెయిల్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ రిమాండ్ గడువును ఈ నెల 23వరకు కోర్టు పొడిగించింది. దీంతో కోర్టులో ఆయన మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
వల్లభనేని వంశీకి షాక్ రిమాండ్ పొడిగింపు..
