ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడి ఆడియో లీక్‌లు తాజాగా బయటపడ్డాయి. లోన్ ఇప్పిస్తే నాతో ఎంజాయ్ చేయాలని ఓ మహిళలతో అసభ్యకరంగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకుడు అలవాల రమేష్ రెడ్డి లోన్ వస్తే తనతో ఎంజాయ్ చేయాలని ఇంతకుముందు కూడా ఓ మహిళతో ఇలానే ఎంజాయ్ చేశానని కాల్‌లో మాట్లాడారు.
నువ్వు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తే తప్పకుండా లోన్ ఇప్పిస్తానని బాధిత మహిళతో మాట్లాడిన మాటలు లీక్ అయ్యాయి. ఇక్కడితో కాకుండా మహిళలను హేళన చేస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఒక అధికార పార్టీ నాయకుడు అయి ఉండి ఇలా మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం ఏంటని, సాయం కోసం అడిగితే ఇలా చేయడం ఏంటని సీనియర్ నాయకుడిపై మండిపడుతున్నారు. ఇలా చేసి పార్టీకి మచ్చ తెచ్చే నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.