ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్..

free-bus-16.jpg

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం లాంటి హామీలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.. కర్ణాటక, తెలంగాణలో ఈ పధకం అమలవుతున్న తీరుపై నివేదికలు కోరింది. రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు.? ప్రభుత్వంపై ఎంతమేరకు భారం పడుతుంది.? అమలులో ఎలాంటి సమస్యలు వస్తాయి.? అనే అంశాలపై పూర్తిస్థాయిలో అధికారులు నివేదికలను సిద్దం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. ఆగష్టు 15 నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం.

Share this post

scroll to top