మేం గేట్లు తెరిస్తే  వైసీపీ  ఖాళీ..

ganta-8.jpg

తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీదే విజయమని చెప్పారు. జగన్‌ను కలిసిన కార్పొరేటర్లు కూడా వాళ్ల పార్టీ అభ్యర్థులకు ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో విశాఖలో భారీగా భూకుంభకోణాలు జరిగాయని, వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. దోచుకున్న భూముల సర్వే నెంబర్లతో సహా పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.

Share this post

scroll to top