విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అమర్నాథ్ సంచలన కామెంట్స్..

amarnath-reddy-13-.jpg

జగన్ మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి. అది ప్రతీ వ్యవస్థలో భాగం. మొన్నటి వరకు కోటరీలో ఉన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత ఇంత కంటే గొప్పగా మాట్లాడతారని భావించలేం. మరొకరి మీద ప్రేమ పుడితేనే మనసులు విరిగిపోతాయి అంటూ విజయసాయి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాజీనామా తరువాత ఇక ఏ రాజకీయ పార్టీలో చేరనని చెప్పి మాటలకు నిన్నటి వ్యాఖ్యలకు తేడా కనిపించింది. 2024లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యివుంటే ఇప్పుడు వెళ్లిపోయిన వాళ్ళు వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఈ విధంగా స్పందించే వాళ్లా? అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.

Share this post

scroll to top