వ్యక్తిగత కారణాలతో ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ చైర్మన్ పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు జీవీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించాడు. అలాగే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. కాగా, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ఐఏఎస్ దినేశ్‌కుమార్ వ్యవహారంపై కొన్ని రోజులుగా జీవీరెడ్డి అసహనంగా ఉన్నట్టు సమాచారం. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వెల్లడించిన జీవీ రెడ్డి వారంరోజులు కాకముందే తన పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీరెడ్డి రాజీనామా..
