ప్రముఖల పేర్లతో డబ్బులు వసూలు చేయడం చూస్తూనే ఉన్నాం.. వారి పేరు చెప్పి.. పలుకుబడి వాడుకొని కూడా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.. తాజాగా, మాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరుతో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారట.. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. తన పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని లేఖ ద్వారా కోరారు.. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ తన పేరుతో ప్రముఖులకు ఫోన్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. గతంలో ఫిర్యాదు చేసిన ఇంకా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడట అగంతకుడు.. జోగయ్య పేరుతో వచ్చిన కాల్స్ తో మోసపోయి డబ్బులు పంపిన వారి జాబితాలో జానారెడ్డి, కామినేని శ్రీనివాస్, మోత్కుపల్లి నరసింహులు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వి. హనుమంతరావు లాంటి రాజకీయ నేతలు కూడా ఉండడం చర్చగా మారింది.. 78010 96535 ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తూ.. గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.. డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమల రావుకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి హరిరామజోగయ్య..
డీజీపీకి హరిరామ జోగయ్య లేఖ.. నాపేరుతో డబ్బులు వసూళ్లు చేస్తున్నారు చర్యలు తీసుకోండి..
