దేవర ముంగిట వారం రోజులు మాత్రమే..

devara-10.jpg

జూనియర్ ఎన్టీఆర్, హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. RRR భారీ హిట్ తర్వాత యంగ్ టైగర్ నుండి రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అటు టైగర్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ లో జెండా పాతాలని పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని హిందీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌కు మంచి ఆదరణ లభించింది. అనిరుధ్ మ్యూజిక్ తో ఫ్యాన్స్ ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి. మరోవైపు దేవర నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మరింత హైప్ పెంచేశాయి. మరోవైపు ఇటీవల కాలంలో దేవర నుండి ఎటువంటి అప్ డేట్ రాలేదు. దింతో ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్ ను టాగ్ చేస్తూ దేవర గురుంచి ఏదైనా అప్ డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. సెకండ్ సింగల్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నిర్మాతలను కోరారు. 

Share this post

scroll to top