నల్లారికి రాజయోగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు..

nalari-.jpg

Read more at: https://telugu.oneindia.com/news/telangana/former-cm-n-kiran-kumar-reddy-likely-to-appoint-as-a-governor-of-telangana-391685.html?yt

భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం కీలక పదవిని కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత చాలాకాలం పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో 76 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

Read more at: https://telugu.oneindia.com/news/telangana/former-cm-n-kiran-kumar-reddy-likely-to-appoint-as-a-governor-of-telangana-391685.html?yt

Read more at: https://telugu.oneindia.com/news/telangana/former-cm-n-kiran-kumar-reddy-likely-to-appoint-as-a-governor-of-telangana-391685.html?yt

Share this post

scroll to top