సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కిందటి నెల 12వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఇతర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ లోపే- విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చేదు ఫలితాలను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఆరుకు ఆరు స్థానాలనూ గెలుచుకుంది. అది కూడా భారీ మెజారిటీతో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయిందనడానికి ఈ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవచ్చంటూ చెబుతున్నారు. గెలిచిన అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్..డిక్లరేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
టీడీపీకి తొలి ఘోర పరాజయం క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ
