మాజీ సీఎం వైఎస్ జగన్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆస్తి తగాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకని అన్నాచెల్లెళ్ళ పంచాయతీలో బయటివాళ్ల జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డారు. వైఎస్. విజయమ్మ ఈ వివాదంలో ఇప్పటికే స్పందించిందన్నారు. కుటుంబ పరంగా ఆన్నా చెల్లెళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని వారు పరిష్కరించుకోగలరన్నారు. జగన్ కు, షర్మిలకు మధ్య తలెత్తిన వివాదం రాజకీయ వివాదం కాదని, బయటివారు దీన్ని రాజకీయ వివాదంగా చేయాలని ప్రయత్నించడం సరికాదన్నారు.
అందరూ నోరు మూసుకోవాలని, బయటవారు అన్నాచెల్లెళ్ళ ఆస్తి తగాదాల్లో మాట్లడటం సమంజసం కాదని నా అభిప్రాయమన్నారు. జగన్, షర్మిలలు ఇద్దరు తెలివైన వారేనని, న్యాయస్థానానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే పరిష్కరించుకోవాల్సి ఉండాల్సిందన్నారు. అవసరమైతే వారి అమ్మ విజయమ్మ జోక్యం చేసుకుని వివాదానికి తెరదించుతారన్నారు.