వైసీపీ ఓటమిలో సవాలక్ష కారణాలు ఉన్నా కుటుంబంలో గొడవలతో పాటు కీలక వ్యక్తులు వైసీపీకి వ్యతిరేకంగా మారి పార్టీని దారుణంగా ఓడగొట్టారని వైసీపీ నేతలు కుమిలిపోతున్నారు. వైఎస్సార్ కుటుంబం అంటే ప్రాణం ఇచ్చే క్యాడర్ ఈ విధంగా అన్యాయం అయిపోయిందని అంటున్నారు. వైసీపీలో సీనియర్లు అంతా ఇదే విశ్లేషణ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఓటమిలో వైఎస్ షర్మిల ప్రభావం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో పరాజయం చవిచూసిన వైసీపీకి ఇప్పుడు జిల్లాల్లో రాజకీయాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. పార్టీ అధినేత తమను పట్టించుకోవడం లేదని కొందరు, మరి కొందరైతే పార్టీలో ఉండలేమని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారు చాలా మంది కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు పెరిగినట్టు అయితే మున్ముందు జిల్లాల్లో కూడా బలమైన నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఎట్టకేలకు బయటపడ్డ సంచలన విషయం..
