ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ కారులో ప్రయాణించారు. ఈ వార్త వినగానే షాక్ తిన్నారా.. ఇద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు కదా అలా ఎలా జరిగిందని డౌట్ పడుతున్నారా.. ఇదెప్పుడు జరిగిందని గూగుల్ చేస్తున్నారా.. అయితే అంత ఎగ్జైట్ కావాల్సిన అవసరం లేదు.. కానీ, ప్రయాణించిన మాట మాత్రం నిజమేనని తెలిసింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్.. అంతకుముందే సచివాలయాన్ని సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
వైఎస్ జగన్ వాడిన కారులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
