ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో విభేదాలు చోటు చేసుకున్నాయా..

tdp-10.jpg

ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో విభేదాలు చోటు చేసుకున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో పార్టీ అంటిముంటన్నట్టుగానే వ్యవహారిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఆయన ఎత్తి చూపిస్తున్నందుకే కొలికపూడి శ్రీనివాసరావును పార్టీ అధినాయత్వం దూరం పెడుతుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. జగన్‌ను తిట్టడానికి కాదు మనల్ని ప్రజలు ఎన్నుకుంది, వారికి మంచి చేయడానికి అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ కి ఎంపీ చిన్నికి అంతగ పొసగడం లేదని తెలుస్తోంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ, కొండపల్లి వద్ద దొరికే బూడిద విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో ఎంపీ కేశినేని చిన్ని విభేదాలు కొని తెచ్చుకుంటున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లా టీడీపీ రోడ్డున పడటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుకుంటున్నారు. దీనిపై అధిష్టానం దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టతరం అవుతుందనే చర్చ సాగుతోంది. మరి పార్టీలో చోటు చేసుకున్న విభేదాలపై టీడీపీ అధినాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Share this post

scroll to top