మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని గత కొద్దిరోజుల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి ముంబైకి వెళ్లారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో చేరారు. అక్కడి వైద్యులు తాజాగా కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతం అయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
మాజీ మంత్రి కొడాలి నాని హార్ట్ ఆపరేషన్..
