గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యథాతథ స్థితిగా (స్టేటస్కో) కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు. దీంతో ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడటంతో నేటి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ ప్రమాణస్వీకారం చేశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం..
