సాధారణంగా డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజు వీటిని తగిన మొతాదులో తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని డ్రై ఫ్రూట్స్ ను నీళ్లలో నానబెట్టి తినడం మంచిదని సూచిస్తున్నారు.
వాల్‌నట్స్..
సాధారణంగా వాల్‌నట్స్ లో టానిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. టానిన్ వల్ల తినేటప్పుడు చేదు అనుభూతి కలుగుతుంది. అందువల్ల వీటిని నీళ్లలో నానబెట్టి తింటే, టానిన్ కంటెంట్ తగ్గి చేదు పోతుంది. వాల్‌నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటిఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
బాదం..
బాదంలో ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే బాదం పప్పులోని అధిక ఫైటిక్ ఆమ్లం.. విటమిన్లను అరిగించే సామార్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాదం పప్పును నానబెట్టి తింటే ఫైటిక్ ఆమ్లం మోతాదును తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఎండు ద్రాక్ష..
ఎండు ద్రాక్షను నీళ్లలో నానబెట్టి తినడం వల్ల పోషక విలువలు మరింత పెరుగుతాయి. నీళ్లలో నానబెట్టడం వల్ల త్వరగా జీర్ణమవడంతో పాటు మలబద్ధకం నివారణలో కూడా సహాయపడుతుంది.