ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తాజాగా మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయ్యారు. ఎన్నికల ముందు టీడీపీకి వ్యూహాలు సూచనలు అందించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితుల పైన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సంక్షేమ పథకాల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని పీకే లోకేష్ కు సూచించినట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పీకే బాంబ్ పేల్చినట్లు తెలుస్తోంది.
లోకేష్ కు ప్రశాంత్ కిశోర్ బిగ్ అలర్ట్..
