పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడనుంది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణ మీద ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ లోని కాప్రా, మల్కాజ్గిరి, ఉప్పల్, ఉస్మానియా, చంద్రాయన్ గుట్ట, ఎల్. బి. నగర్, కర్మన్ఘాట్, అబిట్స్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో తెల్లవారుజామున 2 గంటల నుండి వర్షం పడింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
