కొత్త సినిమాలకు అప్పుడప్పుడు హీరో మహేశ్ బాబు రివ్యూ ఇస్తుంటారు. గత కొన్నాళ్ల నుంచి ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ‘కల్కి’ గురించి తెగ పొగిడేశారు. తనకు ఎంతలా నచ్చేసిందో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గానే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లొచ్చిన మహేశ్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు తాజాగా ‘కల్కి’ మూవీ చూశాడు. ఈ క్రమంలోనే సినిమా చూసిన తర్వాత బుర్ర తిరిగిపోయిందని చెబుతూ అందరినీ తెగ పొగిడేశాడు.
బుర్ర తిరిగిపోయింది.. కల్కికి మహేశ్ రివ్యూ..
