ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్లపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నోటి నుంచి ఆ విధంగా రావడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. పిఠాపురం వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ మీ అభిప్రాయం ఎలా ఉన్నా లోపల మాట్లాడాలని హితువు పలికారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై పవన్ ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని అన్నట్లే అంటే సీఎంను అన్నట్టే నన్నారు. హోంమంత్రిని అనడమే కాదు సీఎంను కూడా పవన్ అన్నట్టే నని మందకృష్ణ మాదిగా విమర్శించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం..
