జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై నేడు ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. ఈరోజు కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఇంజినీర్ రషీద్ సోదరుడు, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనే పోస్టర్‌ను ప్రదర్శించారు. దీనికి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర గందరగోళం స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి పిడిగుద్దులతో దాడులకు దిగారు. ఇక, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో 15 నిమిషాల పాటు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
