మంత్రి నారా లోకేష్ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.. ఫోన్ కాల్‌తో.. చివరకు తనకు మెసేజ్ వచ్చినా స్పందిస్తూ.. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు.. ఓవైపు ప్రజా దర్భార్‌తో ప్రజల సమస్యల నుంచి వినతులు స్వీకరిస్తూ.. మరోవైపు.. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.. అయితే, మంత్రి నారా లోకేష్ వాట్సాప్‌ను బ్లాక్ చేసింది మెటా.. దానికి ఓ ప్రధాన కారణం ఉంది.. పెద్ద ఎత్తున వాట్సాప్ కు మెసేజ్‌లు వస్తుండడంతో మెటా.. మంత్రి లోకేష్ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసింది.. ఈ నేపథ్యంలో.. ప్రజలకు కీలక సూచనలు చేశారు మంత్రి.. ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడీ కి పంపాలని విజ్ఞప్తి చేశారు.. తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు..
మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక సూచన
