ఏపీలో పెట్టుబడులు పెట్టండి..

lokesh-29.jpg

ఏపీలో పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను నారాయణతో సమావేశం అయ్యారు. ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టాలని ఆయన్ను కోరారు. చంద్రబాబు నాయకత్వంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలన కొనసాగుతోందని ఆయనకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ -గవర్నెన్స్‌ను సమగ్రపరచడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చేందుకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయాలని కోరారు. అంతకుముందు వివిధ కంపెనీల సీఈవోలను కలిసిన నారాలోకేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం సహకారం గురించి వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరుతున్నారు.

Share this post

scroll to top