చిన్నారుల‌పై హ‌త్యాచారాలా..

roja-02.jpg

ముఖ్య‌మంత్రి సొంత జిల్లాలో వ‌రుస‌గా చిన్నారుల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతుంటే కూటమి స‌ర్కార్ సిగ్గుప‌డాల‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం​ ఘటన సంచలనం రేపింది. వడమాలపేట మండలం ఏఎంపురంలో మూడేళ్ల చిన్నారిని చాక్లెట్‌లు కొనిస్తాను అని మాయమాటలు చెప్పి సుశాంత్ అనే అబ్బాయి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు చిన్నారి కుటుంబ స‌భ్యుల‌ను వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధులు ఆర్కే రోజా, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి, త‌దిత‌రులు ప‌రామ‌ర్శించారు. 

Share this post

scroll to top