రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతుభరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోంది. బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకూ ఈ పథకాన్ని వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తోంది.
వీరందరికీ రైతు భరోసా కట్..
