ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. బాధ్యతలు చేపట్టారు జనసేనాని.. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. అయితే, ఈ మధ్యే.. మెగాస్టార్ చిరంజీవి భార్య, తన వదిన సురేఖ.. జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఓ పెన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.. బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేస్తున్న తరుణంలో.. తన వదిన గిఫ్ట్‌గా ఇచ్చిన పెన్నును ఉపయోగించారు పవన్ కల్యాణ్..
బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వదిన ఇచ్చిన పెన్‌తో తొలి సంతకం.
