చంద్రబాబు కుట్రలకు వైయ‌స్ జగన్ బలి కావాలా..

nani-25-.jpg

చంద్రబాబు ఏనాడైనా ఆయ‌న‌ తమ్ముడు రామ్మూర్తి నాయుడికి ఆస్తులు రాసిచ్చారా?  అని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్ర‌శ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ వ్యవహారంపై వాస్తవాలను పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఎల్లో మీడియా, కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు కుట్రలకు వైయ‌స్ జగన్ బలి కావాలా తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌ సీపీ  కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. హత్యలు,అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుందని పేర్ని నాని ఆరోపించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

Share this post