భారీ బందోబస్తు నడుమ నెల్లూరు సెంట్రల్‌ జైలుకు పిన్నెల్లి..

prk-.jpg

మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్‌ షాకే తగిలింది. తాజాగా న్యాయస్థానం ఆయనకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్న న్యాయమూర్తి చివరికి ఆయనకు జుల రిమాండ్ ను విధించారు. దింతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా నేడు ఆయనను వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పొలిసు అధికారులు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. ఆయనను జైలుకు తరలించే సాయంలో జైలు బయట, ఆ మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తానికి ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలు అధికారులు పిన్నెల్లిని జైలు లోపలికి తీసుకెళ్లారు. ఈవీఎం విధ్వంసం, పోలింగ్‌ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేకు మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విధించింది. ప్రస్తుతం పిన్నెల్లి జైలు లోకి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this post

scroll to top