వర్మ నాగబాబుకు కౌంటర్..

varma-21-.jpg

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మోదీ ఫొటోలతో ఆయన పోస్ట్ చేశారు. ప్రజలే నా బలం అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన జనసేన మీటింగ్ లో నాగబాబు వర్మను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే ఇక్కడ పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించింది. పవన్ ఇమేజ్, అభిమానులు, ప్రజలు మాత్రమేనని నాగబాబు వ్యాఖ్యానించారు.

అంతే కానీ ఎవరైనా తమ కారణంగానే పవన్ గెలిచాడని భావిస్తే అది వారి కర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్మను టార్గెట్ చేసే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ ఆ సమయంలో తీవ్రంగా సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజలే నా బలం అంటూ వర్మ తన అధికారిక X ఖాతాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్ ద్వారా వర్మ నాగబాబుకు కౌంటర్ ఇచ్చారన్న చర్చ సాగుతోంది.

Share this post

scroll to top